వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – దేశ సంపదనంతా గంప గుత్తగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధారదత్తం చేసిందంటూ నిప్పులు చెరిగారు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్బంగా ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు.
దేశంలోని ప్రధాన వనరులను అప్పగించడం పనిగా పెట్టుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గంప గుత్తగా నిర్వీర్యం చేయడం, ఆ తర్వాత నష్టాల సాకు చూపి తన వారికి, అయిన వారికి, కార్పొరేట్ శక్తులకు, వ్యాపార వేత్తలకు, బడా బాబులకు కట్టబెట్టడం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోందని ఆరోపించారు.
ఈ సమయంలో ఉపాధి ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. నోట్ల రద్దు తీవ్రమైన ప్రభావం చూపిందని, జీఎస్టీ తీసుకు వచ్చి చిన్న వ్యాపారులను నాశనం చేశారని, పరిశ్రమలు ఖాయిలా పడే స్థాయికి చేరుకున్నాయని ఆవేదన చెందారు వాయనాడు ఎంపీ.
ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తామని చెప్పిన మోదీ తను ఇచ్చిన మాట తప్పారని, జన్ ధన్ ఖాతాలో డబ్బులు వేస్తానని చెప్పిన ప్రధాని మోసం చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ.