మోదీ సర్కార్ బక్వాస్ – రాహుల్
నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత
ఢిల్లీ – ఈ దేశం ఎటు పోతోంది. ఎవరి కోసమని మీరు పాలన సాగిస్తున్నారు. ఇదేనా దేశం కోసం ధర్మం కోసం అంటే. హిందూ ధర్మం పేరుతో మీరు చేస్తున్నది ఏమిటో ఒక్కసారైనా ఆలోచించారా. కేవలం గుప్పెడు మంది పెట్టుబడిదారుల కోసం దేశ సంపదను దోచి పెడతారా. అసలు మీకు మనసు ఎలా వచ్చింది. ఈ దేశం ఎన్నటికీ మిమ్మల్ని క్షమించదు..అంటూ నిప్పులు చెరిగారు లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీ.
ప్రధాన మంత్రి మోడీని, ఆయన పరివారాన్ని తూర్పార బట్టారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల ఎవరికి లాభం కలుగుతుందని ప్రశ్నించారు. ఇద్దరు పెట్టుబడిదారులు అదానీ, అంబానీలకు మేలు చేకూర్చేలా రూపొందించారని సంచలన ఆరోపణలు చేశారు.
కమలం అనే చక్ర వ్యూహంలో భారత దేశం బందీ అయి పోయిందని ఆవేదన చెందారు రాహుల్ గాంధీ. ఈ దేశాన్ని ఒక్కరు పాలించడం లేదని, ఆరుగురు కంట్రోల్ చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. వారెవరో కాదు మోడీ, అమిత్ షా, అజిత్ దోవల్, మోహన్ భగవత్, అదానీ, అంబానీలంటూ మండిపడ్డారు.