పేటీఎం మోసం ఆర్బీఐ మౌనం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
పశ్చిమ బెంగాల్ – ఈ దేశాన్ని ప్రవేట్ శక్తులు పాలిస్తున్నాయి. ఫక్తు వ్యాపార వేత్తలకు మోదీ సర్కార్ ఊడిగం చేస్తోంది. అపారమైన వనరులను కట్టబెట్టేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తూ దేశ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ.
భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ దేశం ఎటు పోతోందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. న్యాయం కోసం తాను పోరాడుతూనే ఉంటానని అన్నారు. కూటమిలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఎద్దేవా చేశారు.
ఇవాళ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, ఎళ్లకాలం ప్రజలను మోసం చేయలేరని అన్నారు. సంస్థల
స్వాతంత్య్రాన్ని ధ్వంసం చేస్తూ ప్రభుత్వం దేశాన్ని ఎలా విధ్వంస మార్గంలోకి తీసుకు వెళ్లిందో పేటీఎం మోసం అతిపెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
అయినా సెబీ, ఆర్‌బీఐ వంటి రెగ్యులేటరీ సంస్థలు ప్రధానమంత్రి బొమ్మతో ప్రకటనలు ఇవ్వడంపై మౌనం వీడక పోవడం దారుణమన్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకుని పెద్దగా మారిన ఎన్నో కంపెనీలను ఇలా రాజకీయ పెత్తనం కాపాడిందని ఆవేదన చెందారు.