NEWSNATIONAL

మోడీ హిందువుల ప్ర‌తినిధి కాదు

Share it with your family & friends

రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ – లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలోని హిందువులంద‌రికీ తాను ప్ర‌తినిధి అయిన‌ట్టు భావిస్తున్నారంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

మోడీ త‌నంత‌కు తాను దైవాంస సంభూతుడిగా భావిస్తున్నారంటూ ఆరోపించారు. మోడీ ఒక అడుగు ముందుకు వేసి తనను తాను రక్షించుకోవాల్సి వచ్చింది. అతని రక్షణ పొర పోయిందంటూ ఎద్దేవా చేశారు.

మోడీ తనను తాను హిందువులందరి ప్రతినిధిగా పేర్కొనడం ద్వారా విపరీతమైన తప్పు చేసాడని ఆరోపించారు.. ఇలా చెప్పుకోండం మోడీ మూర్ఖ‌త్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని ఎద్దేవా చేశారు.

మోడీ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వమని ఎప్పటికీ మర్చిపోవద్దని హెచ్చ‌రించారు. తమకు నంబర్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలుకలు ఎప్పుడూ మునిగి పోతున్న ఓడను వదిలి వేస్తాయంటూ మండిప‌డ్డారు.