నీట్ స్కాంపై రాహుల్ ఆగ్రహం
బాధిత విద్యార్థులకు మద్దతు
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో చోటు చేసుకున్న స్కామ్ కు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ప్రతిభ కలిగిన విద్యార్థులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ మేరకు వారంతా రోడ్లపైకి వచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారిగా నీట్ లో అక్రమాలు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్ర నేత, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ సీరియస్ గా స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన ఉంటూ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు ఇస్తామని తెలిపారు. వారితో కలిసి తాను కూడా పోరాటం చేస్తామనని, న్యాయం లభించేంత దాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
భారతీయ జనతా పార్టీ సర్కార్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.