దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. తమ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడంపై మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా తమకు పేరొందిన సంస్థలు, అక్రమార్కుల నుంచి డబ్బులు రాలేదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. ఆయన అరెస్ట్ అక్రమమని ఆరోపించారు రాహుల్ గాంధీ.
ప్రజాస్యామ్యానికి ముప్పు ఏర్పడిందని, మోదీ రాచరిక పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు . ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రతిపక్ష సీఎంలలో అరవింద్ కేజ్రీవాల్ రాబోయే ఎన్నికలకు ముందు అరెస్టు చేయబడ్డ రెండవ వ్యక్తి. కావడం దారుణమన్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని భారతదేశం ఎన్నడూ చూడ లేదన్నారు. ఇది పిరికిపంద చర్య, బలమైన ప్రతిపక్షాల గొంతు నొక్కే దుర్మార్గపు పన్నాగం అని సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.