NEWSNATIONAL

మోదీ మోసం ప్ర‌జ‌ల‌కు శాపం

Share it with your family & friends

రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కేవ‌లం కాషాయం పేరుతో రాజ‌కీయం చేయ‌డం త‌ప్పితే దేశం కోసం ప‌ని చేస్తున్న దాఖ‌లాలు ఏవీ లేవంటూ మండిప‌డ్డారు. ఇవాళ నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయ‌ని , కానీ ఇప్ప‌టి వ‌ర‌కు నియంత్రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన పాపాన పోలేదంటూ పీఎంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాహుల్ గాంధీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. గ‌తంలో నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ ఉండేద‌ని, ఇవాళ పూర్తిగా కార్పొరేట్ శ‌క్తుల చేతుల్లోకి వెళ్లి పోయింద‌ని ఆరోపించారు. ఇవాళ మోదీ కేవ‌లం త‌న వ్య‌క్తిగ‌త చ‌రిష్మా పెంచుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు రాహుల్ గాందీ.

వంట నూనె ఒక‌ప్పుడు లీట‌ర్ ధ‌ర రూ. 52 ఉండేద‌ని కానీ ఇప్పుడు ఆ ధ‌ర రూ. 150 కి పెరిగింద‌న్నారు. ఇక పెట్రోల్ లీట‌ర్ కు రూ. 66 ఉండేద‌ని ఇప్పుడు 100కు పైగానే దాటింద‌న్నారు. డీజిల్ ఒక‌ప్పుడు రూ. 52 ఉండేద‌ని ఇప్పుడు అది కూడా వంద‌కు ద‌గ్గ‌రంలో ఉంద‌ని చెప్పారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర త‌మ హ‌యాంలో రూ. 410 ఉండేద‌ని ఇప్పుడు మోదీ పాల‌న‌లో రూ. 1,100కి చేరుకుంద‌ని సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

ఇక‌నైనా ప్ర‌జ‌లారా ఆలోచించాల‌ని సూచించారు. మీ విలువైన ఓటును ఎవ‌రికి వేస్తున్నామో జాగ్ర‌త్త‌గా వేయాల‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.