గాడి తప్పిన మోదీ పాలన
రాహుల్ గాంధీ ఫైర్
ప్రజలు కోవిడ్‌తో చని పోతున్నప్పుడు, ప్రధాన మంత్రి థాలీ బజావో అని చెప్పారని, మీడియా మొత్తం ఆయనను ఆకాశానికి ఎత్తేసిందన్నారు. కేవలం ప్రచారం తప్ప ఒక్క పని చేసిందీ ఏమీ లేదన్నారు. విచిత్రం యాత్ ప్రచురణ, ప్రసార మాధ్యమాలన్నీ ఆయనను గొప్ప మేధావిగా ప్రొజెక్టు చేశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకవేళ భారత దేశం లోని ఇతర పౌరులు ఎవరైనా థాలీ బజావో అని చెప్పి ఉంటే, వారిని లాఠీలతో కొట్టేవారు లేదా జైలులో పెట్టే వారని అన్నారు రాహుల్ గాంధీ. దీంతో అసలు విషయం ఏమిటంటే దేశాన్ని ఏ రకం వ్యక్తి నడుపుతున్నాడో దేశానికి అంతటీ తెలిసి పోయిందన్నారు.
నిజం చెప్పాలంటే దేశాన్ని నడపగల అవగాహన నరేంద్ర మోదీకి లేదన్నారు రాహుల్ గాంధీ.