మోదీ మణిపూర్ పై మౌనమేల..?
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
మణిపూర్ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన మణిపూర్ లో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలతో సంభాషించారు. వారి సమస్యలను విన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ.
ఓ వైపు ఎన్నికల పేరుతో ప్రధానమంత్రి అంతా తానై వ్యవహరిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని కానీ ఓ వైపు మణిపూర్ తగలబడి పోతుంటే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేశానని కానీ మైతేయి, కుకీ తెగలకు చెందిన వారి మధ్య ఇంకా విభేదాలు ఉండడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు .
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు. మనుషుల మధ్య విభేదాలు సృష్టించి వాటి ద్వారా ఓట్లు రాబట్టు కోవాలనే దుర్భుద్ది ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఈ దేశానికి కావల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాలన్నారు. మణిపూర్ లో ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయని, ఆర్పేందుకు ఏ ఒక్కరు ప్రయత్నం చేయక పోవడం దారుణమన్నారు.
ఇప్పటికైనా నరేంద్ర మోదీ మౌనం వాడాలని రాహుల్ గాంధీ సూచించారు. లేకపోతే దేశంలో దోషిగా మిగిలిపోక తప్పదన్నారు.