మోదీ నియంతృత్వం చెల్లదు
వాయనాడు సిట్టింగ్ ఎంపీ రాహుల్
మధ్యప్రదేశ్ – మోదీ నియంతృత్వం ఇంకానా ఇకపై చెల్లదని హెచ్చరించారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ . పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్య ప్రదేశ్ లోని రత్లాంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా పేర్కొన్నారు రాహుల్ గాంధీ. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ ప్రయత్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇకనైనా ప్రజలు మేల్కోక పోతే తీవ్ర ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. మోదీతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు పెద్ద ఎత్తున తమకు అనుకూలంగా ఉండే రాజ్యాంగాన్ని తయారు చేయాలని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు భారత కూటమి ప్రయత్నం చేస్తోందని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి పేదలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన ప్రజల నుంచి రిజర్వేషన్లు లాక్కోవాలని బీజేపీకి చెందిన వారు కోరుతున్నారని ఆరోపించారు.