ప్రమాదంలో భారత రాజ్యాంగం
మోడీ వస్తే దేశానికి ఇబ్బందికరం
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , రాయ్ బరేలి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన స్థితిని ఎదుర్కొంటోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హిందూత్వ జాతీయ వాదం పేరుతో దేశాన్ని భ్రష్టు పట్టించారంటూ మండిపడ్్డారు. 10 ఏళ్ల కాలం పాటు పాలన సాగించిన బీజేపీ సర్కార్ ఇప్పటి వరకు ఏం సాధించిందో , ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్న బలమైన వ్యవస్థలను నీరు గార్చారని, కేవలం తమ వారికి లబ్ది చేకూర్చేలా ప్రయత్నం చేశారని ఆరోపించారు రాహుల్ గాంధీ.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను కావాలని నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. నష్టాల పేరుతో తన అభిమాన, స్నేహితులైన బిలియనీర్లకు లబ్ది చేకూర్చేందుకు ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారంటూ నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు .
మోడీ మరోసారి పీఎం అయితే భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారంటూ హెచ్చరించారు.