NEWSNATIONAL

మోదీ పాల‌న‌లో బ‌హుజ‌నుల‌కు శాపం

Share it with your family & friends

ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ – దేశంలో విచిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న చెందారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఆయ‌న భార‌త్ జోడో న్యాయ్ యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. కేవ‌లం ఓట్ల కోసం బ‌హ‌జ‌నుల జ‌పం చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఈ సంద‌ర్బంగా ఇటీవ‌ల ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని అయోధ్య రామ మందిరం పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇత‌ర వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల వారు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు చెందిన వారు ఎవ‌రైనా ప్ర‌ముఖంగా క‌నిపించారా అంటూ ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ.

ఇందులో ఒక్క ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు చెందిన ఏ ఒక్క‌రు లేక పోవ‌డం విడ్డూరం కాదా అని నిల‌దీశారు. ఈ దేశంలో మోదీ వ‌చ్చాక పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు రోజు రోజుకు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయే త‌ప్పా ఏ ఒక్క స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌డం లేద‌న్నారు.

సినీ ప్ర‌ముఖులు, క్రీడా, రాజ‌కీయ , ఆధ్యాత్మిక ప్ర‌ముఖులే క‌నిపించారు త‌ప్పా పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి వారు ఎవ‌రైనా ఉన్నారా అని నిల‌దీశారు రాహుల్ గాంధీ.