దేశాన్ని తాకట్టు పెట్టిన మోదీ
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. దేశాన్ని తాకట్టు పెట్టిన ఘనత పీఎంకే దక్కుతుందని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో వేగంగా అభివృద్ది చెందుతున్న భారత దేశ ఆర్థిక వ్యవస్థకు నరేంద్ర మోదీ స్పీడ్ బ్రేకర్ గా మారారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఇప్పటికే అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడంటూ ధ్వజమెత్తారు.
ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. కొద్ది మంది వ్యాపారవేత్తల కోసం మోదీ పని చేస్తున్నారని, వారికి లబ్ది చేకూర్చేలా చర్యలు చేపట్టారని ఆరోపించారు రాహుల్ గాంధీ.
కానీ కాంగ్రెస్..పేదలకు సాధికారత కల్పించడం ద్వారా అభివృద్ధిని వేగవంతం చేసిందన్నారు. అయితే నరేంద్ర మోడీ.. కొద్దిమంది స్నేహితుల ప్రయోజనాల కోసం దేశాన్ని ఖాళీ చేస్తున్నారని వాపోయారు. విధానాల్లో దేశ ప్రజలను అగ్రగామిగా ఉంచకుండా దేశాభివృద్ధి అసాధ్యమని పేర్కొన్నారు.