NEWSNATIONAL

పెద్ద‌ల‌కు అంద‌లం పేద‌ల‌కు దూరం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కొంద‌రు పెద్ద‌ల‌కు మేలు చేకూర్చేందుకు కోట్లాది మంది పేద‌ల‌ను దూరం పెట్టారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి మోదీని టార్గెట్ చేశారు. దేశాన్ని అప్పుల కుప్ప‌గా మార్చార‌ని, ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేక పోయార‌ని , దీంతో ప్ర‌జ‌లు నిల‌దీస్తార‌ని భావించి కొత్త నాట‌కానికి తెర లేపారంటూ వాపోయారు.

రాముడి పేరుతో రాజ‌కీయం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌జ‌లు మోదీని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌న్నారు రాహుల్ గాంధీ. బ‌డా బాబులు, వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ కంపెనీల‌కు లాభం చేకూర్చేలా పాల‌న సాగిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు . ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు .

ప్ర‌జ‌లు విమానంలో ప్ర‌యాణం చేయాల‌ని క‌ల‌లు క‌న్నార‌ని, కానీ న‌రేంద్ర మోదీ వారి నుండి పేద‌లు నిత్యం ప్ర‌యాణం చేసే రైల్వేల‌ను దూరం చేయాల‌ని కుట్ర ప‌న్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు రాహుల్ గాంధీ.
ఏటా 10 శాతం ఛార్జీల పెంపు, డైనమిక్ ఛార్జీల పేరుతో దోచు కోవడం, పెరుగుతున్న రద్దు ఛార్జీలు, ఖరీదైన ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల మధ్య పేదలు అడుగు కూడా వేయలేని స్థితికి చేరుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన మినహాయింపులను తుంగలో తొక్కడం ద్వారా ప్రభుత్వం గత 3 సంవత్సరాలలో వారి నుండి రూ. 3,700 కోట్లు వసూలు చేసింద‌ని ఆరోపించారు. ఏసీ కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు జనరల్‌ కోచ్‌ల సంఖ్యను తగ్గిస్తున్నార‌ని అన్నారు.