మోదీ మోసం దేశానికి శాపం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
మహారాష్ట్ర – ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టి 10,000 వేల కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇందుకు గుర్తుగా ముంబైలో అశేసమైన ఆదరణల భించింది రాహుల్ గాంధీ యాత్రకు. తనను అంతం చేయాలని ప్రయత్నం చేసినా తాను అదరను బెదరనని అన్నారు.
దేశంలోని వనరులను అన్నింటిని గంప గుత్తగా తన తాబేదారులు, బడా బాబులు, కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు మోదీ ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 143 కోట్ల మంది భారతీయులు దీనిని గమనించాలని సూచించారు. కులం పేరుతో, మతం పేరుతో దేశాన్ని విభజించి ఓట్లు దండుకునేందుకు మోదీ పరివారం ప్లాన్ చేసిందన్నారు.
ఈ దేశానికి కావాల్సింది మోదీ కాదని ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమానత్వం , గౌరవం అన్నారు రాహుల్ గాంధీ. జరగబోయే ఎన్నికల్లో ప్రజలు అత్యంత విలువైన ఓటును పని చేసే వారికి వేయాలని సూచించారు .