మోదీ పాలనలో ఆడబిడ్డలకు రక్షణేది
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ కూటమి సర్కార్ హయంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మంతంలో ఒక శక్తి ఉందని, దానిని లేకుండా చేయాలన్నదే తన అంతిమ లక్ష్యమని ప్రకటించారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్బంగా జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. అసలు బీజేపీ ఏ పరువు గురించి మాట్లాడుతోందని ప్రశ్నించారు. మణిపూర్ లో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించారో యావత్ దేశం చూపిందన్నారు. ఈ దేశంలో మోదీ వచ్చాక మహిళలకు, ఆడ బిడ్డలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు రాహుల్ గాంధీ.
దేశం కోసం తమ ప్రతిభా పాటవాలతో గౌరవాన్ని తీసుకు వచ్చిన మహిళా రెజ్లర్ల పట్ల అనుసరించిన తీరు దారుణమన్నారు. ఇప్పటి వరకు తమ పార్టీకి చెందిన ఎంపీపై చర్యలు తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు మాజీ చీఫ్. ఈసారి ఎన్నికల్లో నీతికి, ధర్మానికి మధ్య పోటీ జరుగుతోందన్నారు.