నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఈ దేశంలో ఏం మిగిలి ఉందని చెప్పు కోవడానికి. అన్నీ అమ్మకానికి పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. ప్రస్తుతం దేశంలో వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు, బడా బాబులకు ధారదత్తం చేసే పనిలో ప్రధాన మంత్రి నిమగ్నమై ఉన్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇవాళ ప్రచారం తప్ప పనులు చేసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగి పోయిందన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ఖాయిలా పడే స్థితికి చేరుకున్నాయని వాపోయారు.
పేదలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, అన్ని వర్గాలకు చెందిన వారంతా తీవ్రమైన నిరాశ నిస్పృహలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఉత్పాదకత పెంచే దిశగా పరిశ్రమలను ఏర్పాటు చేసిన పాపాన పోలేదన్నారు.
పొద్దస్తమానం మతం పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో రాజకీయం చేయడం తప్ప బీజేపీ ఈ దేశంలో చేసింది ఏమీ లేదన్నారు. దేశానికి కావాల్సింది ద్వేషం కాదని ప్రేమ కావాలని నొక్కి చెప్పారు రాహుల్ గాంధీ.