మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
యూపీ – ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ ధ్వజమెత్తారు. కేవలం నలుగురు వ్యాపారవేత్తల కోసమే పీఎం పని చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ , సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో కలిసి ముందుకు సాగారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ. అత్యంత ధనవంతులైన పారిశ్రామికవేత్తలకు రూ. 14 లక్షల కోట్లు మాఫీ చేశారంటూ ధ్వజమెత్తారు.
విచిత్రం ఏమిటంటే గత కొన్నేళ్లుగా తాము పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, పోరాటాలు చేసినా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ సరిహద్దులోకి రాకుండా కంచెలు వేశారని, దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ దేశాన్ని సర్వ నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు.