మణిపూర్ మండుతూనే ఉండాలా
లోక్ సభలో నిప్పులు చెరిగిన రాహుల్
న్యూఢిల్లీ – లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ వైపు మణిపూర్ మండి పోతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు. ఈ సందర్బంగా ప్రతిపక్షాలతో కూడిన కూటమి సభ్యులంతా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
మణిపూర్ ఇంకా ఎంత కాలం మండుతూనే ఉండాలని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. భారతీయ జనతా పార్టీ ఎంపీలకు మానవత్వం అన్నది ఉందా అని నిలదీశారు. సాటి మనుషుల మధ్య విభేదాలు సృష్టించి, కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయడం పనిగా పెట్టుకున్న మీకు పాలించే నైతిక హక్కు లేదన్నారు రాహుల్ గాంధీ.
ఆచరణకు నోచుకోని హామీలతో ఇలా ఎంత కాలం నెగ్గుకు వస్తారంటూ మండిపడ్డారు. ఇకనైనా మణిపూర్ రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండేలా చూడాలని కోరారు. లేక పోతే ఈ దేశంలో మణిపూర్ అనేది ఒకటి ఉందనేది కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు రాహుల్ గాంధీ.