స్టాలిన్ ను సర్ ప్రైజ్ చేసిన రాహుల్
సర్ ప్రైజ్ చేస్తూ స్వీట్ షాపు లోకి
తమిళనాడు – ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన ద్వేషం నశించాలి ప్రేమ విరాజిల్లాలని పిలుపునిచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఈ దేశానికి కావాల్సింది కాషాయం కాదు, ద్వేషం అంతకన్నా కాదు కావాల్సింది మానవత్వం అంటూ ప్రకటిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో దేశాన్ని ఒకే తాటి పైకి తీసుకు వచ్చేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఇది ఊహించని సక్సెస్ అయ్యింది. ఈ దేశంలో అత్యధిక కిలోమీటర్లు తిరిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్ తో కలిసి బిజీగా మారారు. ఆయన పదే పదే ద్వేషం వద్దు ప్రేమ ముద్దు అంటూ చెబుతున్నారు. ఇదే తన నినాదంగా ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా ఉన్నట్టుండి రాహుల్ గాంధీ సెక్యూరిటీని కాదని రోడ్డు పక్కగా ఉన్న స్వీటు షాపు లోకి వెళ్లారు. డివైడర్ ను దాటడం , ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి. అక్కడే ఉన్న స్వీటు షాపు లోకి వెళ్లారు. వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం స్వీట్లు కొనుగోలు చేశారు. అక్కడి నుంచి నేరుగా సీఎం స్టాలిన్ వద్దకు వెళ్లారు. తాను తీసుకు వచ్చిన స్వీట్ ప్యాకెట్లను ఆయనకు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.