దేశ ప్రజలకు రుణపడి ఉన్నాం
ప్రకటించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎన్నికల పండుగ ముగిసింది. ఎవరూ ఊహించని రీతిలో ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి గణనీయమైన సంఖ్యలో సీట్లను కట్టబెట్టారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ దేశం ప్రమాదంలో నుంచి తమను తాము కాపాడుకున్నారని ఇందు కోసం ప్రత్యామ్నాయంగా భారత కూటమిని ఆదరించారని చెప్పారు. ఇందుకు ఓటు వేసిన వారికి ఓటు వేయని వారికి రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు.
నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు రాహుల్ గాంధీ. ఇండియా కూటమి కీలక సమావేశంలో ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్ని వర్గాల వారు తమకు ఓట్లు వేశారని, వారి ఆశలకు అనుగుణంగా తాము గొంతు విప్పుతామని పేర్కొన్నారు.
భారత ప్రజలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడారని వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోని అణగారిన, పేద జనాభా తమ హక్కులను కాపాడు కోవడానికి భారత కూటమికి అండగా నిలిచారని చెప్పారు.