NEWSNATIONAL

వ‌య‌నాడ్ కు రుణ‌ప‌డి ఉన్నా

Share it with your family & friends

కాంగ్రెస్ ఎంపీ భావోద్వేగం

కేర‌ళ – కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ భావోద్వేగానికి లోన‌య్యారు. బుధ‌వారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన అభినంద‌న స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేశారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడు నుంచి ఆయ‌న సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇక్క‌డి నుంచే మ‌రోసారి బ‌రిలో నిలిచారు. ఇదే స‌మ‌యంలో బీజేపీకి షాక్ ఇస్తూ ఆయ‌న త‌న త‌ల్లిని ఆద‌రిస్తూ వ‌చ్చిన యూపీలోని రాయ్ బ‌రేలి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో నుంచి పోటీ చేశారు.

వ‌య‌నాడు, రాయ్ బ‌రేలి నియోజ‌క‌వ‌ర్గాల‌లో రాహుల్ గాంధీ అత్య‌ధిక మెజారిటీతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశారు. ఆయ‌న ఆరు నెల‌ల కాలంలో ఏదో ఒక స్థానాన్ని వ‌దులు కోవాల్సి ఉంటుంది. ఇది ప‌క్క‌న పెడితే త‌న‌ను ఆద‌రించి గెలిపించిన ప్ర‌తి ఒక్క ఓట‌రుకు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. మీ రుణం మ‌రిచి పోలేనంటూ ప్ర‌క‌టించారు.