NEWSNATIONAL

మెట్రోలో ప్ర‌యాణించిన రాహుల్

Share it with your family & friends

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

న్యూఢిల్లీ – కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ గురువారం న్యూ ఢిల్లీలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. ఆయ‌న మెట్రో రైలులో ప్ర‌యాణం చేశారు. ప్ర‌యాణీకుల‌తో క‌లిసి జ‌ర్నీ చేయ‌డంతో ఒక్క‌సారిగా అందులో ప్ర‌యాణం చేస్తున్న వారు విస్మ‌యానికి లోన‌య్యారు. రేప‌టి భ‌విష్య‌త్తు యువ‌త‌పైనే ఉంద‌ని న‌మ్ముతున్న నాయ‌కులలో మొద‌టి నేత రాహుల్ గాంధీ.

ఆయ‌న గ‌త కొంత కాలంగా తాను ప‌ప్పు కాద‌ని ఫైర్ అని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ధానంగా ప్ర‌ధాని మోదీ పాల‌న‌పై ఎక్కు పెట్టారు. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఇంటా బ‌య‌టా ఏకి పాడేస్తున్నారు. కేవ‌లం కొద్ది మంది పెట్టుబ‌డిదారుల‌కు మేలు చేకూర్చేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో తాను మెట్రోలో ప్ర‌యాణం చేయ‌డం త‌న‌కు సంతోషం క‌లిగించింద‌న్నారు రాహుల్ గాంధీ. తోటి ప్రయాణికుల‌ను క‌లుసు కోవ‌డం, వారి యోగ క్షేమాల‌ను క‌నుక్కోవ‌డం మ‌రింత ఆనందాన్ని ఇచ్చింద‌న్నారు .