దిగ్గజ నాయకుడు కళైంజ్ణర్
కొనియాడిన రాహుల్ గాంధీ
తమిళనాడు – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ సీఎం , దివంగత కళైంజ్ఞర్ కరుణానిధి జూన్ 3న సోమవారం 100వ జయంతి. ఈ సందర్బంగా తన తల్లి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
కరుణానిధి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రజల సంస్కృతిని, భాషను కాపాడిన తమిళనాడుకు చెందిన గొప్ప నాయకుడంటూ ప్రశంసలు కురిపించారు.
ఆయనను స్మరించుకుంటూ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమ సమయంలో ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు అగ్ర నేత.