NEWSNATIONAL

నెహ్రూ ఆధునిక భార‌త రూప శిల్పి

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ – భార‌త దేశ తొలి ప్ర‌ధాన మంత్రి పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ వ‌ర్దంతి ఇవాళ‌. మే 27న కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ దేశానికి ఆయ‌న అందించిన సేవ‌ల గురించి గుర్తు చేశారు.

ఆధునిక భార‌త దేశ రూప శిల్పిగా త‌ను ఎన‌లేని కృషి చేశారంటూ కొనియాడారు రాహుల్ గాంధీ. ఆయ‌న జీవితం ఈ దేశానికి , 143 కోట్ల మంది భార‌తీయుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా మారింద‌ని పేర్కొన్నారు. ఇవాళ ఆధునిక భార‌తం ప్ర‌పంచానికి స్పూర్తి దాయ‌కంగా నిల‌వ‌డంలో నెహ్రూ కీల‌క‌మైన పాత్ర పోషించార‌ని తెలిపారు.

అంతే కాదు పంచ‌శీల సూత్రాన్ని ముందుకు తీసుకు వ‌చ్చిన గొప్ప నాయ‌కుడు పండిట్ జీ అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. దార్శనికుడిగా, తన జీవితమంతా స్వాతంత్ర ఉద్యమం ద్వారా భారతదేశాన్ని నిర్మించడం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం , రాజ్యాంగ పునాది వేయడం కోసం అంకితం చేశాడని స్ప‌ష్టం చేశారు.

పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పాటించిన విల‌వలు, ఆచ‌రించిన సూత్రాలు మ‌నంద‌రికీ ఎప్ప‌టికీ ఆద‌ర్శ ప్రాయంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు.