సిద్దూకు రాహుల్ గాంధీ నివాళి
దారుణ హత్యకు గురైన సింగర్
పంజాబ్ – దారుణ హత్యకు గురైన ప్రముఖ పంజాబ్ సింగర్ , కాంగ్రెస్ నాయకుడు సిద్దూ మూసేవాలాకు నివాళులు అర్పించారు. గ్యాంగ్ స్టర్ ఆధ్వర్యంలో పక్కా ప్లాన్ తో తనను హత మొందించారు. ఈ సంఘటనలో అక్కడికక్కడే సిద్దూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై పంజాబ్ లో కొలువు తీరిన ఆప్ భగవంత్ మాన్ సర్కార్ సీరియస్ గా స్పందించారు. ఈ మేరకు సిట్ విచారణకు ఆదేశించింది. పట్టుకునే ప్రయత్నం చేసినా ప్రధాన నిందితులు తప్పించుకున్నారు. వారంతా కెనడా, లండన్ లో తల దాచుకున్నట్లు తేలి పోయింది.
వారి కోసం లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చినా ఇప్పటి వరకు దోషులు పట్టు బడలేదు. ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. ప్రస్తుతం సిద్దూ మూసేవాలా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
బుధవారం సిద్దూ మూసేవాలా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.