7 స్థానాలలో భారతీయ జనతా పార్టీ విక్టరీ
మహారాష్ట్ర – ఏఐసీసీ మాజీ చీఫ్, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ ప్రచారం చేసినా మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి చెందిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. గతంలో కంటే ఈసారి తక్కువ సీట్లు రావడం గమనార్హం.
విచిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీ ప్రచారం చేసిన ఏడు నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 6 సీట్లను కైవసం చేసుకుంది. మరో సీటును ఏక్ నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ అభ్యర్థి గెలపొందారు. అంటే ఏడు సీట్లు క్లీన్ స్వీప్ చేసింది ఎన్డీయే కూటమి.
ఇది ఒకరకంగా బిగ్ ఎఫెక్ట్ అని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ ప్రచారం చేసిన నియోజకవర్గాలలో నందుర్బార్ , ధమన్ గావ్ రైల్వే , నాగ్ పూర్ తూర్పు, గోండియా, చిమూర్ , నాందేడ్ నార్త్ , బాంద్రా ఈస్ట్ ఉన్నాయి.
వీటిలో బీజేపీ, శివసేన, యుబిటీ గెలుపొందాయి. ఫలితాలను బట్టి చూస్తే 2019లో బీజేపీ సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు విజయం సాధించడం విశేషం. ఇందులో 5 సీట్లు ఎక్కువగా వచ్చాయి. 109కి పైగా సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. కేవలం 19 సీట్లకే పరిమితమైంది ఆ పార్టీ. ఆ పార్టీతో జత కట్టిన బాల్ ఠాక్రే శివసేన , ఎన్సీపీ పవార్ పార్టీలు తక్కువ సీట్లకే పరిమితం అయ్యాయి. విచిత్రం ఏమిటంటే పవార్ కూడా ఓడి పోయాడు.