రాహుల్ జోష్ కాంగ్రెస్ ఖుష్
ఎగ్జిట్ పోల్స్ లో హస్తం హవా
ఢిల్లీ – ఏఐసీసీ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత , రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మరారు. ఆయన గత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా పలు సమస్యలపై నిలదీస్తున్నారు. తన హయాంలో పార్టీ డ్యామేజ్ అయిన ఇమేజ్ ను తానే భుజాల మీదకు ఎత్తుకున్నారు. పార్టీకి జీవం పోయడంలో కీలక పాత్ర పోషించారు. ఇందుకు ప్రధాన కారణం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర . ఇదే దేశంలో కలకలం రేపింది.
మొన్నటి దాకా దేశంలో ప్రజాదరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టాప్ లో కొనసాగుతుండగా రాను రాను ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు రెడీ అయ్యారు రాహుల్ గాంధీ. ఆయన ప్రస్తుతం లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
తాజాగా హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించారు. బీజేపీని, మోడీని, ఆయన పరివారాన్ని, కాషాయ సంస్థలను ఏకి పారేశారు. ఓ వైపు దేశం పలు సమస్యలతో సతమతం అవుతోందని, కానీ మోడీ తన వ్యక్తిగత ప్రచారంపైనే ఎక్కువగా దృష్టి సారించారని ఎద్దేవా చేశారు.
దీని వల్ల నష్టం 143 కోట్ల భారతీయులకు కాదా అని ప్రశ్నించారు. ఆయన ఏ అంశాన్ని వదలడం లేదు. ప్రత్యేకించి యువత, రైతులు, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా తాజాగా ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో హర్యానాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని, ఇక జమ్మూలో సైతం ఒమర్ అబ్దుల్లాతో కలిసి పవర్ లోకి రానుందని జోష్యం చెప్పాయి.