రాహుల్ గాంధీకి డల్లాస్ లో గ్రాండ్ వెల్ కమ్
పలు ప్రాంతాలలో పర్యటించనున్న నేత
అమెరికా – కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్ సభ ప్రతిపక్ష నేత, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం డల్లాస్ లో ఘణ స్వాగతం లభించింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు నుదుటన సింధూరం దిద్ది ఆహ్వానం పలికారు.
ఈ సందర్బంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా అమెరికాలో పర్యటించడం ఇది మొదటిసారి కాదన్నారు. గతంలో కూడా పర్యటించడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా యుఎస్ లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా గుర్తింపు పొందింది భారత దేశం. అమెరికా పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ సందర్బంగా తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకుంటారు రాహుల్ గాంధీ.
ఇప్పటిక ఇండియాలో పరిణతి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు . అంతే కాకుండా ప్రస్తుతం కొలువు తీరిన మోడీ భారతీయ జనతా పార్టీని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఏకి పారేస్తూ వస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రతి పక్ష నాయకుడిగా ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ఆదరణ చూరగొంటున్నారు.
ఇదే క్రమంలో భారత దేశంలో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ యూఎస్ టూర్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.