NEWSNATIONAL

రైల్వే బోర్డు చైర్మ‌న్ గా దళితుడికి ఛాన్స్

Share it with your family & friends

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న కేంద్రం

ఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోడీ భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తొలిసారిగా దేశంలోనే అత్యున్న‌త‌మైన రైల్వై బోర్డు సంస్థ‌కు చైర్మ‌న్ గా ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికి ప‌ట్టం క‌ట్టింది. ఈ మేర‌కు చైర్మ‌న్ గా నియ‌మించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలిపింది.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం దేశ రైల్వే బోర్డు చైర్ ప‌ర్స‌న్ గా , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా జ‌య వ‌ర్మ సిన్హా ప‌ని చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌ద‌వీ కాలం ఆగ‌స్టు 31తో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. దీంతో ఎవ‌రిని చైర్మ‌న్ గా ఉన్న‌త ప‌ద‌విలో నియ‌మిస్తార‌నే దానిపై ఉత్కంఠ‌కు చెక్ పెట్టారు పీఎం మోడీ.

ఐల్వే బోర్డు ప్ర‌స్తుత చైర్ ప‌ర్స‌న్ , సీఈవో జ‌య వ‌ర్మ సిన్హా స్థానంలో ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS) అధికారి అయిన‌ సతీష్ కుమార్ రైల్వే బోర్డు ఛైర్మన్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా నియమితులయ్యారు.

షెడ్యూల్డ్ కులం లేదా దళిత సామాజిక వ‌ర్గం నుండి ఈ స్థానానికి ఎంపికైన మొదటి వ్యక్తి కావ‌డం విశేషం. భార‌త దేశ రైల్వే చ‌రిత్ర‌లో ఈ ఎన్నిక సంచ‌ల‌నంగా మారింది. మొత్తంగా ప్ర‌ధాన మంత్రి మోడీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. రాబోయే నాలుగు రాష్ట్రాల‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.