NEWSNATIONAL

మోదీని ప్ర‌తిపాదించిన రాజ్ నాథ్

Share it with your family & friends

ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాని

న్యూఢిల్లీ – కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్డీయే, భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీల నాయ‌కుడిగా న‌రేంద్ర మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్ర‌తిపాదించారు. ఆయ‌న చేసిన ప్ర‌తిపాద‌న‌కు భాగ‌స్వామ్య ప‌క్షాల స‌భ్యుల‌తో పాటు బీజేపీకి చెందిన ఎంపీలు చ‌ప్ప‌ట్ల‌తో స్వాగ‌తం ప‌లికారు.

ఆయా భాగ‌స్వామ్య ప‌క్షాల నేత‌లు తాము బేష‌ర‌తుగా మోడీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు లేఖ‌లు అంద‌జేశారు. కేంద్రంలో అధికారంలోకి రావ‌డానికి కావాల్సిన అవ‌స‌ర‌మైన సంఖ్యా బ‌లాన్ని ముందే రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు అంద‌జేయ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా న‌రేంద్ర మోడీ వ‌రుస‌గా మూడోసారి ప్ర‌ధాన‌మంత్రి కానున్నారు. ఆయ‌న చ‌రిత్ర సృష్టించ‌నున్నారు. గ‌తంలో దేశ చ‌రిత్ర‌లో ఈ రికార్డు దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి , దివంగ‌త జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పేరు మీద ఉంది.

ఈ రికార్డును న‌రేంద్ర మోడీ తాజాగా బ్రేక్ చేయ‌నున్నారు . మొత్తంగా మ‌రోసారి చ‌క్రం తిప్పారు అమిత్ చంద్ర షా.