NEWSNATIONAL

కేబినెట్ లో రాజ్ నాథ్ కీల‌కం

Share it with your family & friends

న‌రేంద్ర మోడీకి పెద్ద‌న్న
న్యూఢిల్లీ – ఎన్డీయే – బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వంలో కేంద్ర మంత్రిగా కొలువు తీరారు రాజ్ నాథ్ సింగ్. ఆయ‌న గ‌తంలో ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న‌కు 72 ఏళ్లు. దేశానికి 29వ డిఫెన్స్ మినిష్ట‌ర్ గా ఉన్నారు. భార‌తీయ రాజ‌కీయవేత్త‌గా గుర్తింపు పొందారు. వృత్తి రీత్యా లెక్చ‌ర‌ర్ గా ప‌ని చేశారు. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలుపొందారు. దీంతో మ‌రోసారి మంత్రిగా క‌న్ ఫ‌ర్మ్ చేశారు మోడీ.

రాజ్ నాథ్ సింగ్ 2005 నుండి 2009 దాకా, 2013 నుండి 2014 వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీకి జాతీయ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. త‌ను తొలి నాళ్ల‌ల్లో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ లో కార్య‌క‌ర్త‌గా ప‌ని చేశారు. రాజ్ నాథ్ సింగ్ గ‌తంలో 2000 నుండి 2002 వ‌ర‌కు ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి 19వ సీఎంగా ప‌ని చేశారు.

1999 నుండి 2000 వ‌ర‌కు వాజ్ పేయి ప్ర‌భుత్వంలో రోవ‌డ్లు ర‌వాణా, ర‌హ‌దారుల శాఖ మంత్రిగా ఉన్నారు. 2003 నుండి 2004 వ‌ర‌కు వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా ప‌ని చేశారు రాజ్ నాథ్ సింగ్. 2014 నుండి 2019 వ‌ర‌కు మోడీ కేబినెట్ లో కొలువు తీరారు. ఆయ‌న‌కు న‌మ్మిన వ్య‌క్తిగా పేరు పొందారు.

అంతే కాదు 1988 నుండి 1990 వరకు భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. అంత‌కు ముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2002 నుండి 2008 వ‌ర‌కు , 1994 నుండి 2001 దాకా రాజ్ నాథ్ సింగ్ రాజ్య స‌భ స‌భ్యుడిగా ఉన్నారు.