మా మధ్య మాల్వీ కుంపటి పెట్టింది
11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం
హైదరాబాద్ – నటుడు రాజ్ తరుణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు లావణ్య. తాను తరుణ్ 11 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పారు. గత మూడు నెలలుగా తనతో రాజ్ తరుణ్ దూరంగా ఉంటున్నాడని వాపోయింది.
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, రాజ్ తరుణ్ కు మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపించింది . ఎలాగైనా సరే తనను వదిలించు కోవాలనే ఉద్దేశంతోనే రాజ్ తరుణ్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడంటూ వాపోయింది.
వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని, డ్రగ్స్ కేసులో మస్తాన్ తన ఫ్రెండ్ కావడంతో ఈ కేసులో కావలని ఇరికించారంటూ కన్నీటి పర్యంతం అయ్యింది. 11 ఏళ్ల నుండి రాజ్ తనతో ఉన్నాడని తెలిపింది. రాజ్ తో ఏడేళ్ల పాటు కలిసి సంసారం చేశామని చెప్పింది.
రాజ్ తరుణ్ అంటే తనకు పంచ ప్రాణం అని తెలిపింది. మా జీవితంలోకి అనూహ్యంగా మాల్వీ మల్హోత్రా ప్రవేశించిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నరకం అనుభవిస్తున్నట్లు వాపోయింది.