నటుడు రాజ్ తరుణ్ కు కోర్టు ఊరట
ముందస్తు బెయిల్ మంజూరు
హైదరాబాద్ – టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ కు భారీ ఊరట లభించింది. తనపై హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. లావణ్య రాజ్ తరుణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె తనను పెళ్లి చేసుకున్నాడని, మోసం చేశాడని ఆరోపించింది. అంతే కాకుండా మరో నటితో తనకు ఎఫైర్ కూడా ఉందంటూ పేర్కొంది.
దీంతో గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వ్యవహారం తెలుగు సినిమా రంగాన్ని కుదిపేసింది. తనకు ఏపాపం తెలియదని, తాను అమాయకుడినంటూ వాపోయాడు రాజ్ తరుణ్. అటు లావణ్య ఇటు రాజ్ తరుణ్ లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. మాటలతో హీటు పుట్టించారు.
వీరి వ్యవహారం తీవ్ర దుమారం చెలరేగడంతో సినీ పెద్దలు ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రాలేదు. లావణ్య ఆయా టీవీ ఛానళ్లలో రాజ్ తరుణ్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ముంబైకి చెందిన ఓ నటితో సన్నిహితంగా ఉన్నాడంటూ, వాట్సాప్ చాట్స్ , స్క్రీన్ షాట్స్ కూడా వెల్లడించింది.
దీనిపై ముందస్తుగా మేల్కొన్న రాజ్ తరుణ్ తనకు లావణ్యతో ఎలాంటి బంధం లేదంటూ పేర్కొన్నాడు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించాడు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి సంబంధించి పెళ్లి జరిగినట్లు ఆధారాలు లేక పోవడంతో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది .