బీజేపీ వైపు రాజ్ ఠాక్రే చూపు
మరాఠాలో మారుతున్న సమీకరణలు
మహారాష్ట్ర – సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరాఠాలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పని చేస్తోంది. ప్రధానంగా మహా ఘట్ బంధన్ సర్కార్ ను కూల్చడంలో ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షా సక్సెస్ అయ్యారు.
ఇందులో భాగంగా కొత్తగా సీఎంగా కొలువు తీరారు ఏక్ నాథ్ షిండే. బీజేపీ కొట్టిన దెబ్బకు బాల్ ఠాక్రే తనయుడు ఉద్దవ్ ఠాక్రే షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం మరో సోదరుడు రాజ్ ఠాక్రే కీలకంగా మారారు ఈ తరుణంలో. ఆయనను తమ వైపు లాగేసేందుకు ప్లాన్ చేస్తోంది బీజేపీ .
ఇదిలా ఉండగా మహారాష్ట్రలో బీజేపీ, శివ సేన, ఎన్సీపీ , ఎన్డీఏ మహా కూటమిలో రాజ్ ఠాక్రే చేరాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు టాక్. దీంతో రాజ్ ఠాక్రే హుటా హుటిన ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఆయన వెంట మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు.
అయితే రాజ్ ఠాక్రే షిర్డీ నుంచి లేదా ముంబై నుంచి ఎంపీగా బరిలో నిలిచే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల భోగట్టా. ఒకవేళ ఆయన గనుక పోటీ చేస్తే మిగతా పార్టీల నుంచి ఫుల్ సపోర్ట్ దొరుకుతుందని భావిస్తున్నారు రాజ్ ఠాక్రే. మొత్తంగా రాజ్ వ్యవహారం కీలకంగా మారింది.