ఎన్డీఏలో చేరిన రాజ్ థాకరే
ప్రధాని మోదీకి బేషరతు మద్దతు
మహారాష్ట్ర – ఎంఎన్ఎస్ పార్టీ చీఫ్ రాజ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. అధికారికంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు . ఈ మేరకు మోదీని ప్రశంసించారు. 30 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తి పూర్తి మెజారిటీతో ఎన్నికైన వ్యక్తిని తానేనని పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ భారత్ కు ప్రధాని కావాలని చెప్పిన బీజేపీ కంటే ముందు కూడా నేనే మొదటి వాడినంటూ స్పష్టం చేశారు రాజ్ థాకరే. ఈ సందర్బంగా మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీల అధికార మహాయుతి కూటమికి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడిగా ఉన్న రాజ్ థాకరే సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఎంఎన్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గుడి పడ్వా లో భారీ ర్యాలీ చేపట్టారు. మోదీ అద్భుతమైన నాయకుడని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించ బోతున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది చివరలో జరగనున్న రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు సన్నద్దం కావాలని రాజ్ థాకరే తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.