కేసీఆర్ కు షాక్ రాజయ్య రాజీనామా
పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన
హైదరాబాద్ – లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా గుర్తింపు పొందారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ రాజయ్య.
ఆయన గతంలో బీఆర్ఎస్ కేబినెట్ లో కొలువు తీరారు. అనూహ్యంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో రాజీనామా చేశారు. తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో చివరి దాకా తనకు సీటు వస్తుందని ఆశించారు. కానీ ఆయన ఆశలపై నీళ్లు చల్లారు కేసీఆర్. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ బహిరంగంగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని , చెప్పలేని చోట తాకాడంటూ విమర్శలు చేయడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
ఇదే సమయంలో రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. స్టేషన్ ఘణ పూర్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. ఆయన గెలుపొందారు. ఏదో ఒక పదవి ఇస్తానని మాటిచ్చారు. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. దీంతో రాజయ్య ఇక గులాబీ బాస్ కు రాం రాం చెప్పారు.