SPORTS

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు రూ. 7 కోట్లు

Share it with your family & friends

ఐపీఎల్ 2024లో 3వ స్థానంలో ఆర్ఆర్

చెన్నై – ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా సాగిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2024 క‌థ ముగిసింది. గౌత‌మ్ గంభీర్ మార్గ ద‌ర్శ‌క‌త్వంలో శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు విజేత‌గా నిలిచింది. ఆసిస్ స్టార్ క్రికెట‌ర్ ప్యాట్ క‌మిన్స్ నేతృత్వంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ ర‌న్న‌ర‌ప్ గా తో స‌రి పెట్టుకుంది.

ఇక మూడ‌వ స్థానంలో సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిల‌వ‌గా ఫ్లాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీ ఆధ్వ‌ర్యంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నాలుగో ప్లేస్ తో స‌రిపెట్టుకుంది. ఇక ప్రైజ్ మ‌నీ ప‌రంగా చూస్తే ఐపీఎల్ విజేత‌గా నిలిచిన కేకేఆర్ కు రూ. 20 కోట్ల బ‌హుమ‌తి కింద ద‌క్కాయి.

ఇక 2వ స్థానంలో ర‌న్న‌ర్ అప్ గా నిలిచిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు రూ. 12.50 కోట్లు ద‌క్కాయి బ‌హుమానంగా. ఇక 3వ స్థానంలో నిలిచిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీం కు రూ. 7 కోట్లు ల‌భించాయి. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు నాలుగో స్థానంలో నిలవడంతో రూ. 6.5 కోట్లు ద‌క్కాయి.