6 వికెట్ల తేడాతో చెన్నై అద్భుత విజయం
చెన్నై – ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను తన స్వంత గడ్డపై ఓడించి పరువు పోకుండా కాపాడుకుంది రాజస్థాన్ రాయల్స్ . స్కిప్పర్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. సూర్య వంశీ , శాసన్ , జురైల్ దుమ్ము రేపారు.
యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చి పోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతులు ఎదుర్కొని 57 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. కెప్టెన్ శాంసన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యవంశీ, సంజూ కలిసి రెండో వికెట్ కు 58 బంతుల్లో 98 పరుగులు జోడించారు. 41 రన్స్ చేయగా రియాన్ పరాగ్ నిరాశ పరిచాడు. మైదానంలోకి వచ్చిన ధ్రువ్ జురేల్, హెట్మెయిర్ కలిసి గెలుపు బాట పట్టించారు. జురైల్ దంచి కొట్టాడు. అంతకు ముందు జైశ్వాల్ 36 పరుగులతో విరుచుకు పడ్డాడు.
ఇక చెన్నై విషయానికి వస్తే ఆయుష్ మాత్రే 43, బ్రెవిస్ 42, శివమ్ దూబే 39 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆకాశ్ మద్వాల్ 29 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయగా యుధ్వీర్ సింగ్ 47 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.