రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
ముగిసిన ఐపీఎల్ వేలం
హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ తుది జట్టును ప్రకటించింది. 13 ఏళ్ల 8 నెలల వయసు కలిగిన వైభవ్ సూర్యవంశీని కోటి 10 లక్షల రూపాయలకు తీసుకుంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ కుర్రాడికి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి వేలం పాటలో రిటైన్ చేసుకోలేదు చాహల్ , బట్లర్ ను.
ఈ ఇద్దరి ఆటగాళ్ల పంట పండింది. రూ . 18 కోట్లకు చాహల్ అమ్ముడు పోయాడు. ఇతడిని ప్రీతి జింతా ఓనర్ షిప్ కలిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చేజిక్కించుకుంది. ఇక గుజరాత్ టైటాన్స్ జాస్ బట్లర్ ను రూ. 15 కోట్లు వెచ్చింది.
రిటైన్ చేసుకున్న వాళ్లలో సంజూ శాంసన్ , జైశ్వాల్ ఉన్నారు. సిమ్రోన్ ను కూడా తీసేసుకుంది. ఈడా ఏడాది ఐపీఎల్ లో హెడ్ కోచ్ గా ఉన్న కుమార సంగక్కర తప్పు కోవడంతో అతడి స్థానంలో మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వచ్చాడు.
ఇక మొత్తంగా జట్టు పరంగా చూస్తే రిటైన్ చేసుకున్న వాళ్లలో సంజూ శాంసన్ , రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్ , షిమ్రాన్ హెట్మెయిర్ , సందీప్ శర్మ , జైస్వాల్ ఉన్నారు. ఇక కొత్తగా తీసుకున్న ఆటగాళ్లలో మహేష్ తీక్షణ, వనిందు హసరంగా , ఆకాష్ మధ్వల్ , కుమార్ కార్తికేయ, నితీశ్ రాణా, తుషార్ దేష్ పాండే, శుభమ్ దూబే, యుధ్వీర్ చరక్ , ఫూరూఖీ ఉన్నారు.