బీజేపీకి బిగ్ షాక్ తప్పదు
రాజ్ దీప్ సర్దేశాయ్ కామెంట్
న్యూఢిల్లీ – దేశంలో పేరు పొందిన మీడియా జర్నలిస్టులలో ఒకరుగా గుర్తింపు పొందారు రాజ్ దీప్ సర్దేశాయ్. ఎన్నికలకు సంబంధించి ముందస్తు అంచనాలు ప్రకటించడంలో ఆయన సిద్దహస్తుడిగా పేరు పొందారు. 2019లో జరిగిన ఎన్నికల సందర్బంగా ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు సరిగ్గా వర్కవుట్ అయ్యాయి.
తాజాగా రాజ్ దీప్ సర్దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రకటించిన అంశాలు విస్తు కలిగించేలా ఉన్నాయి. ఆయన వీడియో సందేశాన్ని పంచుకున్నారు. కర్ణాటక , మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో భారీగా బీజేపీ సీట్లు కోల్పోనుందని పేర్కొన్నారు.
బీహార్, రాజస్థాన్ , హర్యానాలో భారత కూటమికి పెద్ద సంఖ్యలో సీట్లు రానున్నాయని జోష్యం చెప్పారు. బీజేపీ ప్రధానంగా చర్చకు తీసుకు వచ్చేలా చేసిన రామ మందిరం, మంగళ సూత్రం తాకట్టు పెడతారంటూ చెప్పడం ప్రభావితం చేయనున్నాయని అంచనా వేశారు.
బీజేపీ పోరాటం కేవలం 272 సీట్ల కోసమే తప్పా 400 సీట్లు కానే కావని కుండ బద్దలు కొట్టారు.