రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగం
రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలి
హైదరాబాద్ – ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతి పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్. తను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనేనని చెప్పారు. రామోజీ ఫిలిం సిటీకి చేరుకుని రామోజీ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. అక్షరాలతో కూడా సమాజాన్ని మార్చవచ్చని, కోట్లాది మందిని ప్రభావితం చేయించ వచ్చని నిరూపించాడని కొనియాడారు. ఈ సమయంలో రాజేంద్ర ప్రసాద్ కంటతడి పెట్టారు. రామోజీరావు మృతితో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు.
సినీ రంగానికి , పత్రికా రంగానికి రామోజీరావు చేసిన సేవలు, చేసిన ప్రయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని స్పష్టం చేశారు రాజేంద్ర ప్రసాద్. ఇదిలా ఉండగా ఆయనను చివరి రోజుల్లో కొందరు దుర్మార్గులు చాలా ఇబ్బంది పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
విచిత్రం ఏమిటంటే భగవంతుడు వాళ్ల పని చేశాడని, ఆయన అనుకున్నది సాధించి మరీ వెళ్లారంటూ తెలిపారు.