ఏపీకి తరలి వచ్చిన ప్రముఖులు
రాజకీయ నేతలు..సినీ నటీనటులు
అమరావతి – ఆంధప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సీఎంలు, కేంద్ర మంత్రులు, సినీ, క్రీడా రంగాలకు చెందిన నటీ నటులు, ఆటగాళ్లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి విశిష్టమైన అతిథులుగా హాజరయ్యారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే , మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ దేశ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ , చిరాగ్ పాశ్వాన్ తో పాటు వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
దగ్గుబాటి పురందేశ్వరి, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ , భార్య కూడా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారు.