రామోజీ రావు నా గురువు
రజనీకాంత్ సంతాపం
తమిళనాడు – రామోజీ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. శనివారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తన గురువు అని పేర్కొన్నారు. ఈ వార్తతో గొప్ప వ్యక్తిని కోల్పోయానని , ఆత్మీయుడు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు .
మీడియో మొఘల్ గా కీర్తించారు రజనీకాంత్. తను ఉన్నంత వరకు తనకు విలువైన సలహాలు, సూచనాలు ఇచ్చారని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తనకు బాధ కలిగించిందని వాపోయారు.
ఈ వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు రజనీకాంత్. జర్నలిజం, సినిమా, రాజకీయాల్లో గొప్ప కింగ్‌మేకర్‌గా చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు అంటూ కొనియాడారు. తన జీవితంలో నాకు మార్గదర్శకుడు, నిరంతర ప్రేరణగా నిలిచాడని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.