డీఎంకే మర్రి చెట్టు లాంటిది – రజనీకాంత్
ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుంది
తమిళనాడు – ప్రముఖ తమిళ సినీ నటుడు, సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బహిరంగంగా ప్రస్తుత ప్రభుత్వం డీఎంకేకు మద్దతు ప్రకటించడం కలకలం రేపింది. ఇప్పటికే తమిళ సినీ రంగానికి చెందిన దిగ్గజ నటుడు తలపతి విజయ్ నూతన పార్టీని ప్రకటించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇదిలా ఉండగా ఆదివారం రజనీకాంత్ కీలక కామెంట్స్ చేశారు. బహిరంగంగానే అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి మద్దతు ప్రకటించారు. ఆయన సీఎం ఎంకే స్టాలిన్ కు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం విస్తు పోయేలా చేసింది.
డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని అన్నారు రజనీకాంత్. ఎలాంటి తుఫానునైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి ఉంటుందని స్పష్టం చేశారు.
డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించ లేరంటూ పేర్కొన్నారు సూపర్ స్టార్. ఇదిలా ఉండగా. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ హాట్ టాపిక్ గా మారాయి తలైవా రజనీకాంత్ కామెంట్స్.