25 ఏళ్లకు పైగా జైలు శిక్ష
న్యూఢిల్లీ – ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ దారుణ హత్య కేసు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు సంబంధించిన కేసు సుదీర్ఘ కాలంగా జరిగింది. ఇదిలా ఉండగా ఈ కేసులో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. వారి కోరికను మన్నించారు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ప్రస్తుత సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ, కొడుకు రాహుల్ గాంధీ.
ఈ మేరకు కోర్టు కూడా వారని విడుదల చేయాలని ఆదేశించింది. భారత దేశ చరిత్రలో ఈ తీర్పు చరిత్రాత్మకమైనదిగా భావిస్తారు. ఇది పక్కన పెడితే రాజీవ్ గాంధీని హత్య చేసిన వారిలో భారతీయులతో పాటు శ్రీలంకకు చెందిన వారు కూడా ఉన్నారు.
కాగా సుదీర్ఘ కాలం పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత దోషులుగా ఉన్న వారు నిర్భయంగా విడుదల కావడం విశేషం. అయితే 2022లోనే దోషులందరినీ విడుదల చేయాలని ఆదేశించింది. కానీ కొంత సమయం పట్టింది. భారత దేశానికి చెందిన నళిని, పెరరివాలన్, రవిచంద్రన్ కోర్టు ఆదేశాల మేరకు వెంటనే రిలీజ్ అయ్యారు. వీరి గురించి తిరు స్టాలిన్ కృషి చేశారు.
వీరితో పాటు శిక్ష అనుభవించిన శ్రీలంకకు చెందిన పౌరులు మురుగన్ , జయ కుమార్ , రాబర్ట్ పీఎస్ తిరుచి లోని ప్రత్యేక శిబిరంలో ఉన్నారు. వారు తిరిగి తమ దేశానికి వచ్చేశారు.