కొలువుల కోసం కొట్లాటకు సిద్దం
బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ సీనియర్ నేత రాకేష్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. తాము పవర్ లోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారని ఇప్పటి వరకు దాని ఊసెత్తడం లేదన్నారు రాకేష్ రెడ్డి.
జీవో 46ను వెంటనే రద్దు చేయాలని , బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. లేక పోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసలు రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు .
ఇలా ఎంత కాలం మాయ మాటలతో మభ్య పెడుతూ వస్తారని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. సీఎం ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. పాలనా పరంగా ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లు తప్పితే ఒక్కటి కూడా కొత్తది ఇవ్వలేదన్నారు.