NEWSTELANGANA

దాడులు చేయ‌డం దారుణం

Share it with your family & friends

ప్ర‌శ్నించిన అనుగుల రాకేష్ రెడ్డి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ నేత అనుగుల రాకేష్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి ప‌ర్మిష‌న్ లేకుండా ఉస్మానియా యూనివ‌ర్శిటీలో నిరుద్యోగుల‌పై , జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. గురువారం అనుగుల రాకేష్ రెడ్డి ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఆయ‌న దాడి చేస్తున్న దృశ్యాల‌తో కూడిన వీడియోను షేర్ చేశారు.

ఆనాడు నిజాం రజాక‌ర్ల అరాచ‌కాల గురించి విన్నాన‌ని ఇవాళ వాటిని క‌ళ్ల ముందు చూస్తున్నామ‌ని పేర్కొన్నారు . ఇంత జ‌రుగుతున్నా ఎందుక‌ని సీఎం స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. వంద‌లాది మంది పోలీసులు విద్యార్థుల‌ను ప‌ట్టుకుని కొట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

వాళ్లేమైనా తీవ్ర వాదాలా లేక ఏమైనా రాజ ద్రోహానికి పాల్ప‌డ్డారా అని నిల‌దీశారు అనుగుల రాకేశ్ రెడ్డి. అసలు యూనివర్సిటీ లోకి పోలీసులకు చొరబడే అధికారం ఎవరు ఇచ్చారు? ఇది చట్ట విరుద్ధం కాదా? పోలీసుల‌ నీడలో విద్యార్థులు చదువుకోవాలా అని మండిప‌డ్డారు.

ఉద్యోగాలు ఇవ్వమని అడిగినందుకు చితకబాదుతారా? అదే విద్యార్థులు తిరగబడితే మీరు, మీ పోలీస్లు తట్టుకోలేరని పేర్కొన్నారు. పవర్ ను చూసుకొని తాము పవర్ ఫుల్ అనుకుంటున్నార‌ని, కానీ ఆ పవర్ ఇచ్చింది ఆ యువతనే అని గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు.