గాడి తప్పిన కాంగ్రెస్ పాలన
బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేశ్ రెడ్డి అనుగుల నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై , సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువు తీరి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క శాఖ సరిగా పని చేయడం లేదన్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు రాకేశ్ రెడ్డి.
తెలంగాణ భవన్ లో రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసలు రాష్ట్రంలో విద్యా శాఖకు మంత్రి లేక పోవడం దారుణమన్నారు. ఇదే సమయంలో వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా లేక నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు.
తమది పదే పదే ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ కళ్లు ఉండీ చూడలేని కబోధిలాగా తయారైందని ఆరోపించారవు రాకేశ్ రెడ్డి. ప్రభుత్వ దవాఖానాలలో కనీస వసతులు లేవని వాపోయారు. ఇప్పటి వరకు ఖాళీలు వేలాదిగా ఉన్నప్పటికీ ఎందుకని భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు .
రోగుల ప్రాణాలు విడుస్తున్నా.. కనీస అవసరాలు కల్పించలేక పోతుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాల్సిన సీఎం ప్రైవేట్ ఆస్పత్రులను సందర్శించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.