బాధితులకు రాకేశ్ రెడ్డి భరోసా
అరెస్ట్ అయిన 70 మంది బాధితులు
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకుడు అనుగుల రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం జీవో 46ను రద్దు చేయాలంటూ దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా న్యాయ బద్దమైన డిమాండ్ ను పరిష్కరించాలని కోరిన నిరుద్యోగులు 70 మందిని అరెస్ట్ చేశారు.
ఈ సందర్బంగా బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఉన్న బాధితులను పరామర్శించారు అనుగుల రాకేశ్ రెడ్డి. బాధితులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడించే ప్రయత్నం చేశారు. నిరుద్యోగులతో మాట్లాడిన కేటీఆర్ వారికి భరోసా కల్పించారు.
వెంటనే వారిని విడుదల చేయాలని కోరారు. బయటకు వచ్చేలా చూడాలని రాకేశ్ రెడ్డికి సూచించారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఎలాంటి జాబ్స్ సమాచారం లేదన్నారు. ఎక్కడైనా జాబ్స్, తేదీలు, ఫలితాల డేట్స్ ఇస్తారని రిలీజ్ చేసిన క్యాలెండర్ లో ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ లేక పోవడం దారుణమన్నారు కేటీఆర్.